Cashew nuts (కాజు), Walnuts (వాల్‌నట్స్), Hazelnuts (హేజెల్ నట్స్), Almonds (బాదం) – వీటన్నిటి తినేటప్పుడు వాటిని ముందు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత తినాలి. ఎందుకలా తినాలి అంటే, nuts, seeds, grains వీటిని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తాం. ఏవో అక్కడ పడి ఉన్నాయి, తింటే మంచిదంట అంతవరకే తెలుసు. కానీ వాటికి బ్రెయిన్ ఉంటది, అవి కూడా ఆలోచిస్తాయని తెలవదు. Any nut, seed or grain లక్ష్యం ఏంటి? ఇంకో చోట మొలకెత్తాలి, వాళ్ళ జాతిని పెంచుకోవాలి. దానికోసం ఎన్నాళ్లైనా ఎదురు చూస్తాయి. మళ్లీ మట్టి, నీళ్లు దొరికేంత వరకు ప్రాణం ఉగ్గపట్టుకొని ఎదురు చూస్తున్న ప్రాణాలవి. ఎన్నేళ్లయినా బ్రతుకుతాయి. కొన్ని పదేళ్లు, కొన్ని ఇరవయ్యేళ్ళు బ్రతుకుతాయి.
ఇస్రాయేల్ లో జరిపిన ఎక్సకవేషన్స్ లో oldest seed దొరికింది. దాని వయసు రెండు వేల సంవత్సరాలు. దాని పేరు Judean Palm seed. 2005 లో దాన్ని మళ్లీ మట్టిలో పెట్టి నీళ్ళు పోసారు. అన్నేళ్ల తర్వాత మళ్లీ మొలకెత్తింది. Cool and Dry టెంపరేచర్ లో ఉంచితే, between 30-40 degrees Fahrenheit లో ఉంచితే, అవి ఎన్నాళ్లయినా ఉంటాయి. ఏ సీడ్ ని అయినా Germination Test కి పంపిస్తే, దాని viability ని predict చేసి చెప్తారు. మనకి 32 వేల సంవత్సరాల క్రితం విత్తనాలు దొరికాయి, లక్ష సంవత్సరాల క్రితం grains దొరికాయి. ఈ seeds, nuts మనకంటే ఎన్నో లక్షల సంవత్సరాల నుండి ఉన్నాయి, much older than humans. అవి మనకంటే చాలా తెలివైనవి.
మనం నాలుగు రోజులు అన్నం తినకపోతే చస్తాం. అవి అలా కాదు. ఏళ్ల తరబడి తిండి లేకుండా బ్రతగ్గలవు. అలా బ్రతకడం కోసం, వాటి చుట్టూ ఒక స్కిన్ తయారు చేసుకుంటాయి. ఆ స్కిన్ లోనే దాక్కొని ఉంటాయి. వేరే జంతువు నుండి ప్రాణ రక్షణ కోసం, వాటి స్కిన్ చుట్టూ టాక్సిన్స్ క్రియేట్ చేసుకుంటాయి. సీడ్ చుట్టూ ఫిటిక్ యాసిడ్ ఉంటుంది. అది తింటే మనకి మంచిది కాదు. అందుకే ముందు వాటిని వాటర్ లో soak చేసి, ఆ తరువాత తినాలి. అప్పుడే మంచిగ డైజెస్ట్ అవుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. లేకపోతే మీ పొట్ట bloaty గా ఫీలవుతారు. కడుపు నొప్పి, క్రాంప్స్ రావడం జరుగుతుంది.
ఆపిల్, చెర్రీస్ లో ఉండే సీడ్స్ గాని మనం తింటే, మన కడుపులో cyanide ప్రొడ్యూస్ అవుతుంది. ఒక 150 ఆపిల్ సీడ్స్ గాని తింటే మనం చచ్చిపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ చెట్లు ఫ్రూట్స్ ఎందుకిస్తాయో తెలుసా? చూడ్డానికి అందంగా, తినడానికి టేస్టీగా ఉండే ఫ్రూట్స్ అవి తయారు చేసి మనుషుల్ని, జంతువుల్ని, బర్డ్స్ ని, స్క్విర్రెల్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. మనం తిన్నాక, మన droppings ద్వారా వాళ్ళ జాతిని పెంచుకుంటాయి. అందుకే నీకో పండును ఫ్రీగా ఇస్తాయి. అందులో గ్లూకోజ్ పెడతాయి. దానివల్ల నీకు తియ్యగా ఉంటుంది. తినుకుంటూ బయలుదేరుతావు. అదే ఫ్రూట్ లో ఫైబర్ ని కూడా పెడుతాయి. దానివల్ల నీకు వెంటనే అరిగిపోయి మోషన్ వచ్చేలా చేస్తాయి. ఆ మోషన్ ద్వారా సీడ్స్ బయటకి వెళ్లిపోతాయి, అక్కడ మొలకెత్తుతాయి. ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి వాటికి. అలాగే పచ్చిగా ఉన్న పళ్ళు అసలు తినొద్దు. అందులో పాయిజన్ ఉంటుంది. పండినాకే అందులో ఉన్న పాయిజన్ అంతా ఒకచోట చేరి సీడ్ చుట్టూ ఒక కవర్ లా ఫార్మ్ అవుతుంది. అందుకని పండినవే తినండి.
ఈసారి నట్స్, సీడ్స్ కనబడితే కొరకవద్దు. జీడిపప్పు దొరికింది కదా అని తీసుకెళ్ళి ఏ బిర్యానిలో దొబ్బద్దు. నీళ్ళల్లో soak చేసిన తరువాతే వేయండి. లేకపోతే ఆ జీడిపప్పు వల్ల stomach upset అయిన విషయమే మనకి తెలియదు. బిర్యానీ అనుకుంటాం. బిర్యానీ మానేసి కిచిడీ వండుకుంటాం. మళ్లీ అందులో అదే జీడిపప్పు వేస్తాం. So, be careful.