సినిమా హీరోయిన్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటే నాకెందుకో ఇష్టం ఉండదు. ఎందుకంటే కోటి మందిలో ఒకరికి అలాంటి అవకాశం వస్తుంది and they are very special. వాళ్ళు కూడా అందరిలాగే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనటం నచ్చదు. మిమ్మల్ని అందరినీ మీ అభిమానులు దేవతల్లా చూస్తారు. వాళ్ళ పర్సుల్లో, మొబైల్ స్క్రీన్ సేవర్ లో మీరు ఉంటారు. అలాంటి దేవతలు, మెటర్నిటీ వార్డులో నొప్పులు పడుతూ ఉంటే నేను చూడలేను.
మనందరం పూజించే లక్ష్మీ, పార్వతి, సరస్వతి లు కూడా ఎప్పుడూ ప్రెగ్నెంట్ కాలేదు. పిల్లల్ని కనలేదు. They are not into breeding and they are not into kitchen. పిల్లల్ని కనాలనే కోరిక హ్యూమన్స్ కి ఉంటది, దేవతలకి ఉండదు. మీరు కూడా పెళ్ళిళ్ళు కాకుండా దేవతల్లా ఉంటే మాకు ఇష్టం. As an individual, you are much more stronger than normal girls. మీరైనా మగాన్ని దూరం పెట్టొచ్చు కదా? ప్రేమ లేకపోతే చచ్చిపోతారా? సింగిల్ విమెన్ రైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది కంట్రీలో.
అమ్మ జయలలిత, బెహెన్ మాయావతి, దీదీ మమతా బెనర్జీ…ఇలా ఎంతో మంది ఉన్నారు మిమ్మల్ని ఇన్స్పైర్ చెయ్యడానికి. They don’t need men. మన పురాణాల్లో కూడా ఎంతో మంది సింగిల్ ఉమెన్ ఉన్నారు. హిడింబి ఘటోత్కచున్ని పెంచింది, అలాగే జాబాలి. హాలీవుడ్ లో పెళ్లి పక్కన పెట్టిన సూపర్ స్టార్స్ ఉన్నారు. నికి మినాజ్, రిహానా, కేటీ పెర్రీ, జెన్నిఫర్ లారెన్స్, లేడీ గాగా, సాండ్రా బుల్లాక్…ఇలా ఎందరో ఉన్నారు. స్వర్గంలో కూడా రంభ, మేనక, ఊర్వశి లు అన్ మ్యారీడ్ కాబట్టే, స్వర్గం ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉంది. లేదండీ వాళ్ళు కూడా ఈ మధ్యనే ప్రెగ్నెంట్ అయ్యారు, తలో పిల్లాడ్ని కన్నారు అంటే…ఇంకెందుకురా ఈ జీవితం అనిపిస్తది. చస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అంటే, చావడం కూడా మానేస్తాం. అసలా ఆలోచనే భయంకరంగా ఉంది.
నా మాట విని, దేవతల్లా ఆలోచించండి. మీ ఎనర్జీని మరో విధంగా వాడండి. ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. Rising tribe of single woman. మీరు బిడ్డల్ని కంటే, you become so selfish. అదే బిడ్డని కనకపోతే, ప్రపంచలో ఉన్న పిల్లలందరిని హగ్ చేసుకోవచ్చు. ఒక మదర్ తెరెసా అవ్వండి, ఒక కైలి లా మారండి. హీరోయిన్స్ మాత్రమే కాదు, స్ట్రాంగ్ ఉమెన్ అందరూ మారాలి. మంగళసూత్రం మర్చిపోండి. కాళ్ళు కందకుండా చూసుకునే మగాళ్లు ఎవరూ లేరిక్కడ. అందరూ అలాగే ఏడ్చారు. మీ అదృష్టం బాగుండి ఏ రాముడో తగిలేస్తే, అవో రకం కష్టాలు. ఎవరికీ చెప్పుకోలేం. దయచేసి మీ కలలన్నీ కాపురం మీద పెట్టొద్దు. వాటి కోసం చాలామంది ఉన్నారు. వాళ్ళు కంటారులెండి.
నేను స్ట్రాంగ్ ఉమెన్ అని మీరు ఫీల్ అయితే, be single in life. Only strong women can change this nation. పాపులేషన్ తగ్గుద్ది, కష్టాలు తగ్గుతాయి, ప్రొడక్టివిటి పెరుగుద్ది, మనశ్శాంతిగా ఉంటది. విమెన్ కి రెస్పెక్ట్ తెచ్చి పెట్టినోల్లవుతారు. According to census, divorcees, separated, unmarried అంతా కలిపి ఇప్పుడు ఇండియాలో 70 మిలియన్ సింగిల్ ఉమెన్ ఉన్నారు. నేను కోరుకునేది వాళ్ళు కాదు, single by choice. అలాంటి వాళ్ళు కావాలి. “I don’t need a man in my life” అనే వాళ్ళు కావాలి. వాళ్ళంతా దేవతల్లాగే మారాలి. Just imagine, ఇలాంటి స్ట్రాంగ్ విమెన్ మన దేశంలో ఓ మూడు కోట్ల మంది ఉంటే, ఈ కంట్రీ ఎలా ఉంటదో ఊహించండి. టాప్ లేపేస్తారు! అలాంటి ముక్కోటి దేవతలతో, వాళ్ళ దీవెనలతో ఈ దేశం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను.