వేల సంవత్సరాల నుండి ఎంతో మంది enlightened people, gurus, babas మన మధ్యనే ఉన్నారు. వాళ్ళను చూడగానే కుతూహలంతో ఎన్నో ప్రశ్నలేస్తాం. “స్వామీజీ is it possible to experience God” అని ఒకడు అడుగుతాడు. “If there is no god, who created the universe” అని ఇంకొకడు. “దేవుడంటూ ఉంటే, why do bad things happen to only good people baba?” అంటాం. కర్మఫలాన్ని నిర్ణయించేదెవరు? పునర్జన్మ ఉందా లేదా? ఇలా ఎన్నెన్నో తెలివైన ప్రశ్నలు అడుగుతాం. అయితే ఒక్కో స్వామీజీ ఒక్కో సమాధానం ఇస్తాడు.
“So…that me, through this me, is talking to me” అని వినబడుతుంది. మనం కన్ఫ్యూస్ అవుతాం. 10,000 answers for one question. మీరు “What is life?” అని అందరినీ అడగండి. “బేటా…Life is what happens when you are busy in making other plans” అని ఒక స్వామీజీ, “Life is a song, sing it!” అని ఇంకో బాబాజీ చెప్తాడు. “See! Life is not about finding yourself, it’s about creating yourself” అని మరొకరు. ఇలా రకరకాల సమాధానాలు వస్తాయి.
వాళ్లని మనం ప్రశ్నలతో విసిగించడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. మన ప్రశ్నలు తట్టుకోలేకే వాళ్లు మనల్ని ఆశ్రమంలో జాయిన్ చేసుకొని, మన చేత యోగా, మెడిటేషన్ చేయిస్తారు. మెడిటేషన్ వల్ల thoughtless mind వస్తే, మనలో పిచ్చి ప్రశ్నలు తగ్గించి, కొంచెం మనల్ని calm అయ్యేలా చేస్తారు. ఆశ్రమాల్లో జరిగేది ఇదే.
మర్డర్ చేసింది ఎవడురా అని అడిగితే అందరూ కలిసి ఒక పేరు చెప్తే వినాలని ఉంది. కానీ ఇక్కడ వందల పేర్లు వినబడుతుంటే, ఇంకా ఎందుకు ఇన్వెస్టిగేషన్. లైఫ్ అనేది మిస్టరీ. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయటమంత టైమ్ వేస్ట్ పని మరొకటి లేదు. జీవిత పరమార్థం తెలుసుకోవడానికి బ్యాక్ ప్యాక్ వేసుకొని బాయలుదేరొద్దు. ఏ స్వామీజీని దయచేసి రకరకాల క్వెషన్స్ ఆడగొద్దు. మీ ప్రశ్నలు endless, వాళ్ళ సమాధానాలు ఇంకా endless. ఎవరయినా ఏదన్నా చెప్తే విందాం తప్ప ఏమీ అడగొద్దు. దాని వల్ల ఉపయోగం లేదు.
ఇక్కడ ఎన్ని ప్రవచనాలు జరిగినా, ఎన్ని సత్సంగ్ లు జరిగినా, ఎంత మంది మహానుభావులు పుట్టినా, మన బుద్ధులు మారవు…మనము మారము. ఒక సైంటిస్ట్ తో కూర్చో, నీకు సమాధానాలు దొరుకుతాయి. అదే స్వామీజీతో కూర్చో, నీకు కూడా ఆయనలాగే గడ్డం పెరుగుతుంది.
లైఫ్ (life) గురించి, సోల్ (soul) గురించి, ఏక్సిస్టెన్స్ (existence) గురించి వేసే ప్రతీ ప్రశ్న యూస్లెస్ (useless). “Purpose of Life” ఏంటని ఒక ఏనుగు ఇంకో ఏనుగుని ఆడగదు. కర్మ సిద్దాంతం గురించి ఏ రెండు సింహాలు కూర్చొని మాట్లాడుకోవు. కాబట్టి, అనంతాన్ని తవ్వకూడదు, పరమార్ధాన్ని కెలకకూడదు. ఈ మిస్టరీ లైఫ్ ను మిస్టరీగా చూస్తూ, ఎప్పటికప్పుడు సర్ప్రైస్ అవుతూ ఎంజాయ్ చేస్తూ, మిగతా ఆనిమల్స్ లా గడిపేయడమే సరైన పద్దతి.