రోడ్ మీద వెళ్తుంటాం. తిండి లేక ఒక ముసలమ్మ పడి ఉంటుంది. అది చూసి మన కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది. అతి దారుణంగా ఒక రౌడీ ఎవరో అమాయకుణ్ణి కొడుతుంటాడు. మన కడుపు రగిలిపోద్ది. ఎందుకురా ఇలా చేసావ్ అంటే, అవునురా చేసాను…ఊరకనే చేయలేదు, నా కడుపు మండి చేశాను అంటాడు.
ఎందుకు ప్రతిసారీ కడుపు కడుపు అని నువ్వు అంటావు? నా లివర్ మండింది అనం. నా లంగ్స్‌లో ఇలా ఉంది అని అనం. ప్రతి దానికి కడుపే ఎందుకు గుర్తొస్తుంది? ఎందుకంటే మన కడుపు మన సెకండ్ బ్రెయిన్. మన బ్రెయిన్‌లో ఒక ఆలోచన వస్తే, వెంటనే రియాక్ట్ అయ్యేది మన belly (బెల్లీ), మన gut (గట్). మనం ఫీలయ్యే ప్రతి విషయానికి, మన large intestines రియాక్ట్ అవుతాయి.
ఒక్కోసారి స్టమక్ లో butterflies ఫీల్ అవుతాం. ఏదైనా ఫుడ్ చూస్తే మన కడుపులో జ్యూసెస్ రిలీస్ అయిపోతుంటాయి. నమ్మిన మనిషి మోసం చేస్తే మనకి వాంతులయిపోతాయ్. మీరు స్ట్రెస్ ఫీలైతే, మీ కడుపు upset (అప్సెట్) అవుతుంది. ఎవరి మీదైనా కోపంతో మీరు ఊగిపోతే, మీ కడుపులో ఎసిడిటీ మొదలవుతుంది. అందుకే మన మైండ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. చూసుకోకపోతే, మన సెకండ్ మైండ్ అఫెక్ట్ అవుతుంది.
తినే ఫుడ్ వల్లే కాదు, మన ఆలోచన వల్ల కూడా మన స్టమక్ లో అసిడిటీ ఫార్మ్ అవుతుంది. స్టమక్ అప్‌సెట్ అయితే మనం ఏ పనీ చేయలేం. అందుకే మన గట్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక్కోసారి మనం కన్ఫ్యూషన్ లో ఉంటే, మన ఫ్రెండ్ అడుగుతాడు నీ గట్ ఫీలింగ్ ఏంట్రా అని. అంటే…మన గట్ మనకు నిజం చెప్తుంది. ఈసారి నా టార్గెట్ రీచ్ అయిపోతా మామ, ఇది నా గట్ ఫీలింగ్ అంటాం. అంటే మన మైండ్ లో ఒక ఆలోచన వస్తే, ఫైనల్ డెసిషన్ మన గట్ తీసుకుంటుంది. అందుకే మన కడుపుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
చెత్త ఫుడ్ తిన్నా అది అప్సెట్ అవ్వుద్ది, లేదా లేనిపోని టెన్షన్స్ మైండ్ లో పెట్టుకున్నా అది అప్సెట్ అవ్వుద్ది. స్టమక్ ఎప్పుడు అప్సెట్ అవ్వకుండా చూసుకోవాలి. స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, ప్రోబయాటిక్ ఫూడ్స్ తినాలి. అందులో పెరుగు ఒకటి, గుడ్ బాక్టీరియా. ఈ ప్రోబయాటిక్స్ వల్ల, మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మీరు ఎలాంటి ఫుడ్ తింటే మీ గట్ బాగుంటుందో ఒకసారి మీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. ఏం తింటే మంచిదో తెలియాలి, అలాగే ఏం తినకూడదో కూడా తెలియాలి.
ఒక రూమ్ ని ఎప్పుడూ వాడుతూ ఉంటే క్లీన్ చేయలేము. క్లీన్ చేయాలంటే, వాడటం ఆపాలి. అలాగే మీ పొట్టకి కూడా గ్యాప్ ఇవ్వండి. అప్పుడప్పుడు దాన్ని ఖాళీగా పెట్టండి. అప్పుడే వీలు అవుతుంది. మీ చిట్టి పొట్టిని పదిలంగా చూసుకోకపోతే. మీ కెరీర్ అఫ్ఫెక్ట్ అవ్వుద్ది. మీ గట్ స్ట్రాంగ్ గా ఉంటేనే, మీరు లైఫ్ లో మంచి డెసిషన్స్ తీసుకుంటారు. Your gut feeling is always accurate and correct.