జపనీస్ దగ్గర హ్యాపీనెస్ కోసం ఒక కాన్సెప్ట్ ఉంది. దాని పేరు ఇకిగాయ్. ఏం చేస్తే మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం? ఎక్కువ డబ్బు సంపాదించాలా? మన కోరికలన్నీ తీర్చుకోవడం కోసం బతకాలా? లేదా…అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవాలా?
నువ్వు ఇక్కడ పుట్టినందుకు, ఇక్కడ బ్రతికున్నందుకు, ప్రతి మనిషికీ ఒక ఇకిగాయ్ ఉండాలి. ఇకిగాయ్ అంటే “Reason for Being” (రీసన్ ఫర్ బీయింగ్). Back in the days (బ్యాక్ ఇన్ ద డేస్), మనందరం హంటర్స్ లా బతికేవాళ్ళం. తరువాతరువాత, మన జాబ్స్ మారిపోయాయి. కొత్త కొత్త జాబ్స్ పుట్టుకొచ్చాయి. ఒకడికి పెయింటింగ్ అంటే ఇష్టం, ఇంకోడికి డాన్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమయిన పని చేస్తుంటే మనకి అనవసరమైన ఆలోచనలు ఆగిపోయి, పైగా ఎంతో ఆనందాన్నిస్తాయి. కానీ, డబ్బు ఎవడు ఇస్తాడు. అందుకే ఏదో జాబ్ లో జాయిన్ అయితాము. కొన్నాళ్ల తర్వాత ఎందుకురా ఈ జాబ్ చేస్తున్నాను అనిపించొచ్చు.
నిజానికి మన అందరికీ డబ్బు కావాలి. ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలంటే కంఫర్టబుల్ మనీ కావాలి. అది ఎంతో ఎవడికీ తెలియదు. ఇక్కడ 4 కాంపొనెంట్స్ ఉన్నాయి. ఒకటి – నీకు నచ్చింది చేయటం. రెండు – ప్రపంచానికి నచ్చింది చేయటం. మూడు – బాగా డబ్బులు వచ్చేది చేయటం. నాలుగు – నువ్వు ఎందులో స్పెషలిస్టువో అది చేయటం. ఈ నాలుగు విషయాల్లో, మీరు ఎందులో ఉన్నారో చెక్ చేసుకోండి. ఒక్కసారి నెట్లో ఇకిగాయ్ డయాగ్రమ్ చూడండి. అది చూస్తే నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది.
మీరు 1 & 4 మద్య ఉంటే, అంటే “మీకు నచ్చింది చేయటం, నువ్వు ఎందులో స్పెషలిస్టువో అది చేయడానికి” మధ్య మీరు ఉంటే, మీది ప్యాషన్ (Passion). ప్యాషన్ తో బ్రతుకుతున్నప్పుడు, ఇందులో డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచించండి.
మీరు 1 & 2 మద్య ఉంటే, అంటే “మీకు నచ్చింది చేయటం, ప్రపంచానికి నచ్చింది చేయటం” మధ్య ఉంటే, మీది మిషన్ (Mission). మిషన్ లో ఉన్నప్పుడు, మీరు చేస్తున్న క్రాఫ్ట్ ని ఇంకా ఎలా బెటర్ చేయాలో ఆలోచించండి.
మీరు 3 & 4 మద్య ఉంటే, “బాగా డబ్బులొచ్చేది చేయటం, నువ్వు ఎందులో స్పెషలిస్టువో అది చేయటం.” ఇందులో మీరు ఉంటే, మీది ప్రొఫెషన్ (Profession). ఇందులో మీరు సక్సెస్ అవ్వాలంటే, మీకు ఇష్టమైనవి కొత్త కొత్తవి ఎమున్నాయో తెలుసుకుంటూ బ్రతకాలి.
ఇక లాస్ట్ వన్ (last one), 2 & 3, “ప్రపంచానికి నచ్చింది చేయటం, డబ్బులొచ్చేది చేయటం.” ఈ రెండింటి మధ్య మీరు ఉంటే, మీది వొకేషన్ (Vocation). స్ట్రాంగ్ మైండెడ్ అయ్యుండి డెడికేషన్ తో చేస్తున్నారా పని మీరు. అందుకే మీరు దాన్ని ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా తీసుకుని, దాన్ని ఇంకా ఇంకా బెటర్ చేస్తూ పోవాలి. సో…మనకు ఏం కావాలో మనకు తెలియాలి, మన ఏం చేస్తున్నామో కూడా తెలియాలి. అదే ఇకిగాయ్ – Reason for your being. ఇప్పుడు చెప్పండి, What’s your IKIGAI?
Thank you 🙏