బ్రూస్లీ ఒక మాట చెప్పాడు. నాకు 10,000 కిక్స్ తెలిసినవాడు అంటే భయం లేదు, కానీ ఒక కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినోడితో నేను చాలా జాగర్తగా ఉంటానని. ఎందుకంటే ఆ కిక్ లో వాడు మాస్టర్ అయ్యుంటాడు. అలాంటివాడు గానీ కొడితే మన కాలు ఇరిగిపోద్ది. అందుకే మనకు ఏ పని తెలిస్తే అందులో మాస్టర్ అయిపోవాలి. పోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. దీన్నే సాధన అంటారు.
నువ్వు ఎంత పెద్ద సింగర్ వి అయినా, రోజూ ప్రాక్టీస్ చెయ్. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, దాన్ని నెమరేసుకో. కొండెక్కి అరువు. గొంతు చించుకో. నువ్వు బాక్సర్ వి అయితే, రోజూ కిక్ బాగ్ ని కొట్టు. నీకు బోల్డు నాలెడ్జ్ ఉండొచ్చు. But, knowledge has no value unless you put it into practice. ఒక ఆర్ట్ నీకు పూర్తిగా తెలిసుండొచ్చు. శాస్త్రం మొత్తం నువ్వు చదివేసి వుండొచ్చు. నాకన్నీ తెలుసులే అని కూర్చుంటే చంప పగులుద్ది. కుంగ్-ఫూ టెక్నిక్స్ ఎన్ని తెలిసినా, ప్రాక్టీస్ లేకపోతే కుమ్మేస్తారు.
అమితాబ్ బచ్చన్ గారితో నేను పనిచేసాను, గ్రేట్ యాక్టర్! అయినా సరే, ఆయన రోజూ షూటింగ్ అయిపోగానే, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి తనే స్వయంగా వెళ్ళి, మరుసటి రోజు సీన్ పేపర్ తీసుకుంటారు. ఉదయం లేవగానే, ఆయన అద్దం ముందు నించొని డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ షూటింగ్ లో డైరెక్టర్ దగ్గరికెళ్ళి అదే సీన్ పేపర్ ని డైరెక్టర్ కి ఇచ్చి చదవమని అడుగుతారు. ఎందుకంటే, అతను ఏమనుకుంటున్నాడో, నేనేమయినా నాకు తెలిసిన ఎక్స్ప్రెషన్స్ ఫిక్స్ అవుతున్నానా అని చెక్ చేసుకుంటారు.
అంతేకాదు, ఆ సీన్ లో అతనితో పాటు ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో తెలుసుకొని అవతలోళ్ళు చిన్న యాక్టర్ అయినా సరే, వాళ్ళ దగ్గరికి తనే స్వయంగా వెళ్ళి సీన్ ప్రాక్టీస్ చేద్దామా అని అడిగి, వాళ్ళతో కలిసి డైలాగ్ మరొక్కసారి ప్రాక్టీస్ చేస్తారు. “ఏ ఆప్కా డైలాగ్, అబ్ బోలియే” అంటారు. అవతలాడు డైలాగ్ ఎలా చెప్తున్నాడో చూస్తారు. వాడు అలా చెప్తే, మనం ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో ఫిక్స్ అవుతారాయన. మామూలుగా ఏ యాక్టర్ అయినా వాళ్ళ డైలాగ్ వాళ్ళు చదువుకొని కారవాన్ లో వెయిట్ చేస్తుంటారు షాట్ కోసం. కానీ, అమితాబ్ బచ్చన్ గారు అలాక్కాదు. అందుకే ఆయన అమితాబ్ బచ్చన్ అయ్యాడు. ఆయనతో పోలిస్తే మనం ఎంత?
అందుకే ప్రాక్టీస్ చేయండి. పనిలో ఉన్నా, పని లేకుండా ఖాళీగా ఉన్నా, మీకు ఏది తెలిస్తే అది సాధన చేయండి. సిగరెట్ విసిరితే కరెక్ట్ గా నోట్లో పడాలి. పడితే, నువ్వు రజినీకాంత్ అవుతావు. If you don’t practice, you don’t deserve to win!